AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తన సోపతి భీమ్‌కి శుభాకాంక్షలు తెలిపిన రామ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన ‘దేవర’ సినిమా విడుదలను పురస్కరించుకుని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తన సోపతి భీమ్‌కి రామ్ శుభాకాంక్షలు తెలిపాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు మ్యాటర్‌లోకి వస్తే..

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR) నటించిన ‘దేవర’ (Devara) సినిమా విడుదలను పురస్కరించుకుని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంతకు ముందు రామ్, భీమ్‌గా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసి.. ఆస్కార్ అవార్డును అందుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా వారి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెలియజేశారు. ప్రాణ స్నేహితులమని ఒకరి బర్త్‌డేకి మరొకరు ఏమేం చేసేవారో కూడా పబ్లిగ్గా చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి వారి అభిమానులలో కూడా చాలా వరకు ఛేంజ్ వచ్చింది. ఆ సినిమా తర్వాత వారిద్దరి స్నేహం ఇంకా బలపడుతూనే ఉంది.

ANN TOP 10