AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోక్షగుండం ఆదర్శమా..? కాళేశ్వరమా?.. కొత్త ఏఈఈలు ఆలోచించాలన్న సీఎం రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు అని పేర్కొన్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవన్నారు. నాణ్యత లేకుంటే నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులు ఇన్నేళ్లు నిలబడేవి కావన్నారు. పైఅధికారులు చెప్పారని నాణ్యత, నిబద్ధత విషయంలో రాజీపడవద్దని సూచించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాయన్నారు. కానీ ఐదేళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కూలిపోయిందన్నారు.

నిర్మాణం పూర్తికాకముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచ అద్భుతంగా గత పాలకులు అభివర్ణించారని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో ఎవరిని బాధ్యులను చేయాలి? క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు సమర్థవంతంగా పని చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. నిర్మాణ సామగ్రి నాణ్యత కూడినది కాదని ఇంజినీర్లు వెనక్కి పంపిస్తే కూలిపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు.

నెల రోజుల్లో హెల్త్ కార్డులు..
ప్రజలందరికీ నెల రోజుల్లోనే హెల్త్ కార్డులు అందజేస్తామని రేవంత్ వెల్లడించారు. “ప్రతి ఒక్కరి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయబోతున్నాం. ప్రజల మెడికల్‌ హిస్టరీ వైద్యులకు అందుబాటులో ఉండేలా చూస్తాం. క్యాన్సర్‌తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందరికీ వైద్యం అందేలా చూడటం మనందరి బాధ్యత. వైద్య ఖర్చుల్లో ఎక్కువగా టెస్టులే ఉంటున్నాయి. క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహమ్మారి చికిత్స పేదలకు భారమవుతోంది. రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఆసుపత్రికి వెళ్తే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య గుర్తింపు కార్డులు లేకపోవడం వల్లే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అందుకే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు తీసుకున్నాం” అని రేవంత్ తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10