AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ మరో అవినీతి.. సెక్రటేరియట్‌ నిర్మాణంలోనూ భారీ కుంభకోణం

– ఇష్టారాజ్యంగా ‘అంచనాలు’ పెంపు

– విజిలెన్స్‌ విచారణలో వాస్తవాలు వెలుగులోకి..

– అధిక ఖర్చును చూసి నోరెళ్లబెడుతున్న అధికారులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):

అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవినీతి ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తెలంగాణ సెక్రటేరియేట్‌ నిర్మాణంలోనూ భారీ కుంభకోణం జరిగింది. విజిలెన్స్‌ అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. అధిక ఖర్చును చూసి అధికారులే నోరెళ్లబెడుతున్నారు. బిల్డింగ్‌ నిర్మాణంలో సుమారు రూ.200 కోట్లకుపైగా అవినీతి జరినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ నేతల అవినీతి పుట్ట రోజురోజుకు పెరిగిపోతోంది. ఓ వైపు కాళేశ్వరం.. ఇంకోవైపు విద్యుత్‌ కోనుగోళ్ల అంశం.. మరోవైపు వరంగల్‌ టిమ్స్‌ నిర్మాణంపై విచారణలు జరుగుతున్నాయి. ఈ జాబితాలోకి తెలంగాణ సెక్రటేరియేట్‌ చేరిపోయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు విజిలెన్స్‌ ఎంక్వైరీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కొన్ని విషయాలను బయటపెట్టింది. అవినీతిని ఎంత అందంగా చేయాలో గత ప్రభుత్వాన్ని చూస్తే తెలుస్తుందని పేర్కొంది. సచివాలయం నిర్మాణం రూ.617 కోట్ల అంచనా వేసి మొదలుపెట్టింది గత కేసీఆర్‌ సర్కార్‌. నిర్మాణం పూర్తి అయ్యేనాటికి దాన్ని అమాంతంగా 1,140 కోట్ల రూపాయల వరకు అంచనాలు పెంచి ఖర్చు చేసినట్టు ప్రస్తావించింది.

ఐటీ పరికరాల కొనగోళ్లలోనూ..

సెక్రటేరియేట్‌లో ఐటీ పరికరాల కొనుగోళ్ల కోసం తొలుత 181 కోట్ల రూపాయలు అంచనా వేసి దాన్ని 361 కోట్లకు పెంచినట్టు  కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. అటు సచివాలయం నిర్మాణం కోసం అంచనాల కంటే రూ.523 కోట్లు, ఐటీ పరికరాల కొనుగోలుకు అంచనాల కంటే రూ.180 కోట్ల రూపాయల అధిక ఖర్చు చేసిందని ప్రస్తావించింది. ఈ భాగోతంపై విజిలెన్స్‌ నిగ్గు తేల్చనుంది.

అవినీతి ఎన్ని రకాలుగా అవినీతి చేయవచ్చో ఆ పార్టీకి తెలుసని  కాంగ్రెస్‌ పార్టీ  తెలిపింది. వారి అవినీతి అనుభవంతో అసంబద్ధ ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించింది. బీఆర్‌ఎస్‌ అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు ప్రజా ప్రభుత్వంపై అసంబద్ధ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టింది. మరి విజిలెన్స్‌ విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10