AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరుస రైలు ప్రమాదాల వేళ ‘రైల్ రక్షక్ దళ్’ ఏర్పాటు

దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే తొలిసారి ‘రైల్ రక్షక్ దళ్’ (Rail Rakshak Dal)ను ఏర్పాటు చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో దీనిని అందుబాటులోకి తెచ్చింది. ప్రమాదాల సమయంలో ఘటనా స్థలికి వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టగల సామర్థ్యం ఈ ‘రైల్ రక్షా దళ్’కు ఉంటుందని ఇండియన్ రైల్వేస్ తెలిపింది.

‘రైల్ రక్షా దళ్’ లాంచింగ్ సందర్భంగా నార్త్ వెస్ట్రన్ రైల్వే ఆర్పీఎఫ్ ఐజీ జ్యోతి కుమర్ సతిజ మాట్లాడుతూ, సహాయక కార్యక్రమాల్లో ఆర్‌పీఎఫ్‌ను తొలిసారి చేర్చడం గర్వకారణమని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ స్పందన టీమ్ ఏర్పాటుకు రైల్వే మంత్రి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని చెప్పారు.

కాగా, రైలు ప్రమాదాలను నివారిచేందుకు రూపొందించిన సాంకేతిక కవచ్ 4.0ను పనితీరును కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో మంగళవారంనాడు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో 10 వేల రైలింజన్‌లకు కవచ్ 4.0ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

ANN TOP 10