AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే

జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని పోలీసులు తేల్చారు. 2020లో ముంబయిలోని ఓ హోటల్‌లో తన అసిస్టెంట్‌పై జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడని, లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లుగా పేర్కొన్నారు. నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడికి పాల్పడినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు.. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించారని పోలీసులు తెలిపారు.

ANN TOP 10