AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డీఎస్పీగా జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌

ప్రముఖ మహిళా బాక్సన్‌ నిఖత్‌ జరీన్‌ డీఎస్పీ (స్పెషల్‌ పోలీస్‌) జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. బుధవారం డీజీపీ జితేందర్‌కు జాయినింగ్‌ రిపోర్ట్‌ను అందించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన నికత్ జరీన్ బాక్సింగ్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ నిలిచింది. అలాగే, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను, ఏషియన్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.

ఇటీవల ప్యారిస్‌లో ముగిసిన ఒలింపిక్స్ క్రీడల్లో ఆమె పాల్గొన్నారు. నిఖత్‌ జరీన్‌ను డిఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో డీఎస్పీ (స్పెషల్‌ పోలీస్‌)గా నిఖత్‌ జాయినింగ్‌ రిపోర్ట్‌ను డీజీపీకి అందించింది. ఈ సందర్భంగా నిఖత్‌కు డీజీపీ జితేందర్‌తో పాటు శాంతిభద్రతల అడిషనల్‌ డీజీపీ మహేశ్‌ భగవత్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ANN TOP 10