AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అయోధ్య బాలరాముడికి దుబ్బాక వస్త్రాలతో అలంకరణ

అయోధ్య బాలరాముడిని తెలంగాణలోని దుబ్బాకలో తయారైన వస్త్రాలతో అలంకరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తయారైన చేనేత వస్త్రాన్ని బాలరాముడికి అలంకరించారు. నాలుగు రోజుల పాటు చేనేత మగ్గంపై కార్మికులు లియా లెనిన్ జరీ అంచుతో కూడిన 15 మీటర్ల తెలుపు రంగు వస్త్రాన్ని తయారు చేశారు.

ఢిల్లీకి చెందిన ముక్తిర్ ఫ్యాషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ… దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్త్రాలను సేకరించి అయోధ్య బాలరాముడి ఆలయానికి అందిస్తోంది. ఈ కంపెనీ నెలన్నర క్రితం దుబ్బాక హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీ క్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్ కంపెనీని సంప్రదించింది.

దీంతో వీరు 15 మీటర్ల తెలుపు రంగు వస్త్రాన్ని సిద్ధం చేసి… ముక్తిర్ ఫ్యాషన్స్ ఇండియాకు అందించారు. దీనిని ఆలయానికి అందించారు. అయోధ్య ఆలయ అర్చకులు ఈరోజు బాలరాముడిని ఈ వస్త్రంతో అలంకరించారు.

ANN TOP 10