సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ‘ప్రజా పాలన’ దినోత్సవం వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ పాల్గొననున్నారు. సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న షబ్బీర్ అలీకి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో కలెక్టర్ రాజర్షి షా,ఎస్పీ గౌస్ఆలం తదితరులు ఉన్నారు.
