AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూడు ముళ్లు.. ఏడడుగులు.. గ్రాండ్‌ గా హీరో సిద్ధార్థ్‌ – అదితి పెళ్లి

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
హీరో సిద్ధార్థ్, నటి అదితి మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. సోమవారం ఉదయం వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. దక్షిణాది సంప్రదాయంలో వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ‘‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్థు’’ అని అదితి క్యాప్షన్‌ ఇచ్చారు. నూతన జంటకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహా సముద్రం’లో వీరిద్దరూ జంటగా నటించారు. అక్కడ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సిద్ధార్థ్‌తో రిలేషన్‌ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అదితిరావు హైదరీ మాట్లాడుతూ నాకెంతో ఇష్టమైన ప్రదేశంలో సిద్ధార్థ్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు. మా నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టం. హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్‌ ప్రారంభించారు. అది నాకెంతో ప్రత్యేకం. నా చిన్ననాటి రోజులు అక్కడే ఎక్కువ గడిపాను. కొన్నేళ్ల క్రితం ఆమె కన్నుమూశారు.

ఈ విషయం సిద్ధార్థ్‌కు తెలుసు. ఓ రోజు నా వద్దకు వచ్చి.. ఆ స్కూల్‌కు తీసుకువెళ్లమని అడిగాడు. మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం. మోకాళ్ల పై కూర్చుని.. అతను నాకు ప్రపోజ్‌ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్‌ చేసినట్లు చెప్పాడు’’ అని అదితిరావు హైదరీ చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10