AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖైరతాబాద్ కు పోటెత్తిన భక్తులు..

ఖైరతాబాద్ మహాగణపతి వద్ద నిత్యం భక్తుల రద్దీ   అంతకంతకు పెరుగుతోంది. చివరి నాలుగు రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు బడా గణేష్‌ను దర్శించుకున్నారు. ఈ క్రమంలో గణేష్ కోసం వచ్చే మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో పోకిరీల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

సెప్టెంబర్ 17న మంగళవారం రోజున మహా గణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పేరు గాంచిన ఈ మహా గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వీకెండ్స్ తో కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఖైరతాబాద్, లక్డికపుల్ మెట్రో స్టేషన్లలో జనాలు కిటకిటలాడుతున్నారు. ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. 70 అడుగుల ఎత్తు, 7ముఖాలు, 24 చేతులతో ఆకాశాన్నంటేలా ముస్తాబైన మహా గణనాథుడి రూపం భక్తులను మైమరిపిస్తోంది.

 

ANN TOP 10