AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘హైడ్రా’ చట్టబద్ధ మైనదే.. కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ స్పష్టీకరణ

త్వరలో ఆర్డినెన్స్‌ విడుదల
అసెంబ్లీలోనూ బిల్లు
(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
‘హైడ్రా’ చట్టబద్ధతను కొందరు ప్రశ్నిస్తున్నారని.. హైడ్రా చట్టబద్ధమైనదేనని ఆ సంస్థ కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెం.99 ద్వారా జూలై 19న ప్రభుత్వం హైడ్రాను నెలకొల్పిందని అన్నారు. కార్యనిర్వాహక తీర్మానంతోనే సంస్థ ఏర్పాటు జరిగిందని తెలిపారు. హైడ్రా చట్టబద్ధతపై ప్రభుత్వం పని చేస్తుందని, వచ్చే నెల రోజుల్లోగా అందుకు సంబంధించి పూర్తి విధివిధానాతో ఆర్డినెన్స్‌ విడుదల చేస్తారని తెలిపారు.

త్వరలోనే విశేష అధికారాలు..
హైడ్రాకు త్వరలోనే విశేష అధికారాలతో పాటు ఆరు వారాల తరువాత అసెంబ్లీ లో ‘హైడ్రా’ బిల్లు రాబోతోందని పేర్కొన్నారు. ఎన్టీఎల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో మున్సిపాలిటీలు, నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. గ్రే హౌండ్స్, టాస్కోఫోర్స్‌ తరహాలో తాము పని చేస్తామని రంగనాథ్‌ వెల్లడించారు.

ANN TOP 10