AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

20న కేబినెట్‌ భేటీ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ మంత్రివర్గం సమావేశం ఈ నెల 20న జరుగనుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వ సాయంపై చర్చించనున్నారు. అదేవిధంగా హైడ్రా పని విధానం, హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అంశంపై చర్చిస్తారు. బీసీ రిజర్వేషన్, కులగణన, 200 పంచాయతీయల ఏర్పాటుపై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అంశం చర్చకు రానుంది. దీంతోపాటు రుణమాఫీ, రైతుభరోసాపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.

ANN TOP 10