అమ్మన్యూస్ ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగ కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ నియమించారు. శుక్రవారం పట్టణంలోని ప్రజా సేవాభవన్ లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి తో కలిసి ఆమె వారికి నియామక పత్రాలను అందచేసి అభినందించారు.
గౌరవాధ్యక్షులుగా ఆడే శీల, ప్రధాన కార్యదర్శిగా దేశెట్టి ప్రభావతి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా లత, వైస్ ప్రెసిడెంట్‌గా మంథని సోనియా, కోశాధికారిగా భావన సింగ్, సహాయ కార్యదర్శిగా తుల్జాపుర్ శోభ, నల్వాల సుమ, ఉపాధ్యక్షులుగా తుమ్మల అన్నపూర్ణ, కాటిపెల్లి సునిత, మెస్రం భాగ్యలక్ష్మీ, ఉయికె ఇందిరా, డి.శ్రీలేఖ, సంయుక్త కార్యదర్శులుగా బూర్గుల అనసూయ, సుమన్‌బాయి, పిడుగు ఉమారాణి, నేరెళ్ల లక్ష్మీ, ఉష్కమల్ల లలిత, ప్రచార కార్యదర్శులుగా వడ్డనాల శారద, షేక్ జుబేదా, మహ్మద్ జాబీనా, ప్రమీల, ఆడె లలిత, సోషల్ మీడియా ఇన్‌చార్జి అలాం రూప రోస్టిన్‌లు నియమితులయ్యారు .
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,ఎం.ఏ షకీల్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపల్లి నగేష్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,కౌన్సిలర్ బండారి సతీష్,నాయకులు పోరెడ్డి కిషన్,బూర్ల శంకరయ్య,ఎం.ఏ షకీల్,ఎం.ఏ కయ్యుమ్,దాసరి ఆశన్న,రాహుల సోమన్న,ఎల్మ రామ్ రెడ్డి,బాసా సంతోష్,రమేష్,సంతోష్,అస్బాత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.