AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైళ్లపై రాళ్లు విసిరితే ఐదేళ్ల జైలు శిక్ష..

రైలు ప్రయాణించే సమయంలో రాళ్లు విసరడం వంటి చర్యల వల్ల ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో పాటు రైల్వే ఆస్తులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎస్‌సీఆర్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిణామాలు ఇటీవల పదే పదే జరుగుతున్నాయని తెలిపారు.

దాడులకు పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్‌ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఐదేండ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. కాజీపేట్‌-ఖమ్మం, కాజీపేట్‌-బోంగీర్‌, ఏలూరు-రాజమండ్రి వంటి సమస్యాత్మక విభాగాల్లో వందేభారత్‌ రైళ్లపై దాడి జరిగిందన్నారు. ఇదే విధంగా ఈ సంవత్సరంలోనే తొమ్మిది ఘటనలు చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే అధికారులు అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ANN TOP 10