AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓ గుడ్ న్యూస్ విన్నా.. చార్జ్ షీట్ లో నా గురించి..

బెంగుళూరు రేవ్ పార్టీ ఇష్యూలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇష్యూపై న‌టి హేమ స్పందించింది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసుల చార్జ్ షీట్ పై ఓ వీడియో విడుదల చేసింది.

కొన్ని రోజుల క్రితం బెంగుళూరు రేవ్ పార్టీ అంటూ ఓ రేంజ్‌లో హడావుడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో నటి హేమ తో పాటు మరికొంత మంది డ్రగ్స్ సేవించినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే హేమ మాత్రం ఈ రేవ్ పార్టీ విషయంలో తనకేం తెలియదని, తను డ్రగ్స్ సేవించలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది.

అయితే కాస్త గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ రేవ్ పార్టీ కేస్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్న విష‌యంం తెలిసిందే.. తాజాగా బెంగుళూరు పోలీసులు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుపై 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలైంది. ఈ నేప్యథ్యంలో న‌టి హేమకు షాక్ త‌గిలింది. పార్టీ‌లో హేమ పాల్గొనడ‌మే కాక MDMA డ్రగ్‌ను సేవించినట్టు ఛార్జ్ షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఆధారాలు చూపిస్తూ.. మెడికల్ రిపోర్ట్స్‌ను ఛార్జ్ షీట్‌కు జోడించారు. దీంతో ఈ వ్య‌వ‌హారం మ‌రోసారి హాట్ టాపిక్ అయింది.

అయితే తాజాగా ఈ ఇష్యూపై న‌టి హేమ స్పందించింది. ఈ క్ర‌మంలో బెంగళూరు పోలీసుల చార్జ్ షీట్ పై ఓ వీడియో విడుదల చేసింది. అందులో ఈరోజు ఓ గుడ్ న్యూస్ విన్నాను.. మా‌ లాయర్ ఫోన్ చేసి నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నెగిటివ్ వచ్చాయని చెప్పారు. నేను చేయించుకున్న టెస్ట్‌ల్లో ఆల్రెడీ నెగిటివ్ వచ్చిందని తెలిసిందే.. ఇప్పుడు అఫీషియల్ గా చార్జ్ షీట్ లో నాకు నెగిటివ్ వచ్చిందని ఇచ్చారు. ఈ హ్యాపీ న్యూస్ ను మీతో షేర్ చేసుకుంటున్నానంటూ మాట్లాడింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

ANN TOP 10