AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్‌.. రెచ్చిపోయిన గాంధీ అనుచరులు.. రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి

నీ ఇంటికొచ్చా.. దమ్ముంటే బయటకు రా..

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ–కౌశిక్‌రెడ్డి సవాల్‌–ప్రతి సవాల్‌ మధ్య వాతావరణం వేడెక్కింది. కౌశిక్‌రెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ రంగంలోకి దిగేశారు. తన ఇంటి నుంచి నేరుగా కొండాపూర్‌లోని కౌశిక్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. గేటు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై గాంధీ మద్దతుదారులు రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో కౌశిక్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితి గమనించిన పోలీసులు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

తీవ్ర ఉద్రిక్తత
ఇటు గాంధీ మద్దతుదారులు.. అటు కౌశిక్‌ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా సరే గాంధీ మద్దతుదారులు వెనక్కి తగ్గలేదు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.. నీ ఇంటి కొచ్చా.. దమ్ముంటే బయటకి రా అంటూ డిమాండ్‌ చేశారు. కౌశిక్‌ రెడ్డి కోవర్టు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్టుల మూలంగా పార్టీ నాశనం అయ్యిందని దుయ్యబట్టారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతావా అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే గాంధీ. క్రిమినల్‌ అని తెలిసి గవర్నర్‌ ఆయన్ని దూరంగా పెట్టారని విమర్శించారు గాంధీ.

ANN TOP 10