(అమ్మన్యూస్, హైదరాబాద్):
ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కౌశిక్ రెడ్డి సవాల్‌కు గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ తన ఇంటికి వచ్చి బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయకుంటే తానే.. ఆయన ఇంటికి వెళ్తానని సవాల్ చేసాడు. తన యుద్ధం బీఆర్‌ఎస్ పార్టీతో కాదని.. కౌశిక్ రెడ్డితోనేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మొదట కౌశిక్‌రెడ్డి ఇలా..
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ పార్టీ బీ ఫాంతో ఎమ్మెల్యేగా గెలిచి∙కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు పంపుతున్నాను తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి సంచనల కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి.. తిరిగి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు.
పీఏసీ ఛైర్మన్‌గా శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమించటంపై కూడా మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేను చైర్మన్‌గా నియమించారని ఫైరయ్యారు. ‘ఎమ్మెల్యేల ఫిరాయింపుపై హైకోర్టు తీర్పుతో గాంధీ తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని మాటలు మారుస్తున్నాడు. ఆయన నకిలీ గాంధీగా మారిపోయాడు. ఇంకా బీఆర్‌ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ భవన్ కు రావాలి. నేను గురువారం ఉదయం గాంధీ ఇంటికి వెళ్తా.. ఆయన మెడలో కండువా కప్పుతా. ఇద్దరం కలిసి మీ ఇంటిపై బీఆర్‌ఎస్ జెండా ఎగురవేద్దాం. అనంతరం తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెడదాం.’ అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.
స్పందించిన గాంధీ..
ఈ సవాల్‌పై తాజాగా గాంధీ స్పదించారు. కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఈరోజు తన ఇంటిపై జెండా ఎగరవేయకపోతే.. తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పారు. తన యుద్ధం బీఆర్‌ఎస్‌తో కాదని.. కౌశిక్ రెడ్డితోనేని అన్నారు. ‘దమ్ముంటే రారా నా కొడకా అంటూ రెచ్చిపోయారు. కౌశిక్ రెడ్డి పెద్ద చీటర్ అని.. బీఆర్‌ఎస్ పార్టీని భ్రష్ఠు పట్టించాడని పైరయ్యారు. మాజీ సీఎం కేసీఆర్‌ను నాశనం చేశాడని మండిపడ్డారు. మేం చేతులు కట్టుకొని కూర్చొలేం. దమ్ముంటే రా తేల్చుకుందాం.. కౌశిక్ రెడ్డికి నాకు యుద్ధం. ఎవరి దమ్మేందో తేల్చుకుందాం రా.’ అని గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.