AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

547 ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. పాసింగ్‌ అవుడ్‌ పరేడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుధవారం ఉదయం తెలంగాణ పోలీస్‌అకాడమీకి చేరుకున్న సీఎం రేవంత్‌.. పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. తెలంగాణ పోలీస్‌ అకాడేమి నుండి ఈరోజు 547 సబ్‌ ఇన్‌స్పెక్టర్లు పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు.

ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న వారిలో 145 మంది మహిళా ఎస్‌ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547 లో 401 మంది సివిల్‌ ఎస్‌ఐలు ఉన్నారు. అలాగే 547లో 472 మంది గ్రాడ్యూట్స్, 75 మంది పోస్ట్‌ గ్రాడ్యూఎట్స్‌ ఉన్నారు. వీరిలో 248 మంది ఎస్‌ఐలకు బీ టెక్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంది. పరేడ్‌ కమాండర్‌గా మహిళా ఎస్‌ఐ పల్లి బాగ్యశ్రీ వ్యవహరించారు. ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్న వారిలో అత్యధికంగా 26 నుంచి ముప్పై వయసు గల అభ్యర్థులు ఉన్నారు. 283 మంది 26 నుంచి 30 సంవత్సరాల వయసు కలవారు శిక్షణ పొందారు. అలాగే 182 మంది 25 ఏళ్ళ లోపు వయసున్నవారు సబ్‌ ఇన్‌స్పెక్టర్లుగా శిక్షణ పొందారు.

ANN TOP 10