AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉత్తమ్ సతీమణికి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అరికపూడి..

ఓవైపు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకుని నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా.. మరోవైపు మూడు కమిటీలను తెలంగాణ శాసన సభ ఏర్పాటు చేసింది. పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేషన్, పబ్లిక్ టేకింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా శాసనసభ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌   గా అరికపూడి గాంధీని, ఎస్టిమేషన్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డిని, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే కె.శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాసన సభ ఏర్పాటు చేసిన మూడు కమిటీల్లో ఒక్కోదాంట్లో 12 మంది చొప్పున సభ్యులను నియమించింది.

అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులోనూ.. పీఏసీ పదవి అరికెపూడి గాంధీకి ఇవ్వటంపై హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ ఛైర్మన్ పదవి అరికపూడి గాంధీకి ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. పీఏసీ బాధ్యతలు ప్రతిపక్ష నాయకులకు ఇస్తారని గుర్తు చేసిన హరీష్ రావు.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన అరికపూడికి ఆ పదవిని కట్టబెట్టడమేంటని హరీష్‌ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ANN TOP 10