AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల జోష్‌.. ప్ర‌జాసేవా భ‌వ‌న్‌, కార్యాల‌యంలో సందడి

కండువాలు క‌ప్పి  కంది శ్రీ‌నివాస‌రెడ్డి ఆహ్వానం

ఆదిలాబాద్ః ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల జోష్ కొన‌సాగుతోంది. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి హ‌స్తం కండువాలు క‌ప్పుకుని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి నాయ‌క‌త్వాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తున్నారు. ఆయ‌న నేతృత్వంలో క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తూ కాంగ్రెస్ విజ‌యానికి కృషి చేస్తామంటున్నారు. తాజాగా ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన చేరిక‌ల కార్య‌క్ర‌మానికి కంది శ్రీ‌నివాస‌రెడ్డి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామస్తులు మాడశివారెడ్డి, నక్కల దత్తు, గజ్జి వెంకన్న, రామన్న, రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పట్టణంలోని ఇంద్ర నగర్ కాలనీవాసులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సైతం కండువాలు వేసి స్వాగ‌తం ప‌లికారు. రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్ర‌మించాల‌న్నారు. అన్నివ‌ర్గాల‌ను క‌లుపుకునిపోయి పార్టీ కాంగ్రెస్ అన్నారు.

మ‌నం పాల‌కులం కాదు..సేవ‌కులమని తెలిపారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌ని అన్నారు. వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ అందేలా చూడాల‌న్నారు. గ‌రీబోళ్ల ప్ర‌తినిధులుగా ఎద‌గాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, కౌన్సిలర్ అర్చ‌నారామ్ కుమార్, రూరల్ మండల అధ్యక్షులు అల్చెట్టి నాగన్న, పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బూర్ల శంకరయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల సుకేందర్, నాయకులు ఎం.ఏ కయ్యుమ్, తమ్మల చందు, దాసరి ఆశన్న,రాహుల సోమన్న,నాగన్న,అశోక్, మహిళా నాయకురాలు శ్రీలేఖ ఆదివాసీ, తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10