AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

20 రోజులుగా హోటల్‌ గదిలో బంధించి.. బాలికపై దారుణం

హైదరాబాద్‌లోని నారాయణగూడలో దారుణం చోటుచేసుకుంది. నిర్మల్‌ జిల్లాకు చెందిన ఓ బాలికను ఓ హోటల్‌ గదిలో బంధించి 20 రోజులుగా లైంగికంగా దాడి చేశాడు. బాలికపై జరుగుతున్న అఘాయిత్యం గురించి తెలుసుకున్న షీటీమ్స్‌ సిబ్బంది ఆదివారం సాయంత్రం బాలికను రక్షించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

నిజామాబాద్‌ జిల్లా భైంసాకు చెందిన ఓ బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువకుడు పరిచయమయ్యాడు. అతని ట్రాప్‌లో చిక్కుకున్న బాలికకు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి హైదరాబాద్‌కు రప్పించాడు. నారాయణగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడే బంధించి 20 రోజులుగా లైంగికంగా దాడికి పాల్పడ్డాడు.

బాలిక ఎట్టకేలకు యువకుడి కళ్లుగప్పి ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు వాట్సాప్‌లో లొకేషన్‌ షేర్‌ చేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకుని షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. నారాయణగూడలోని హోటల్‌లో బాధితురాలి లొకేషన్‌ గుర్తించిన పోలీసులు, షీ టీమ్స్‌ ఘటనాస్థలికి చేరుకుని బాలికను రక్షించారు. యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

ANN TOP 10