ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రెండోరోజు క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయి కనిపించాయి. ఒకానొక దశలో లైన్ల మధ్య నుంచి కూడా భక్తులను అనుమతించారు. ఆదివారం కావడంతో చిన్నాపెద్దా తేడా లేకుండా మహా గణపతి దర్శనానికి సిటిజన్లు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.
మరోవైపు, ఖైరతాబాద్‌లో భారీ వర్షం పడింది. వర్షంలో తడుస్తూనే బడా గణేష్‌ని దర్శించుకున్నారు భక్తులు. భక్తులు తడవకుండా రెండు వైపులా ఉన్న క్యూలైన్ల వరకే షెడ్లు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మిగతా క్యూలైన్లలో తడుస్తూనే బడా గణేష్‌ను తిలకించారు భక్తులు.
గరం నలువైపుల నుంచి భక్తులు తరలివచ్చారు. మొదటి రోజు 2 లక్షల మంది దాకా దర్శించుకున్నట్టు నిర్వాహకులు చెబుతుండగా, రెండోరోజు అంతకంటే ఎక్కువమంది వచ్చి ఉంటారని తెలిపారు. రద్దీ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.