AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కిషన్‌రెడ్డికి నిరసన సెగ.. ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రి పర్యటన

(అమ్మన్యూస్, ఖమ్మం ):
ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటిస్తుండగా నిరసన సెగ తగిలింది. కిషన్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారును స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోగా తాము కిషన్‌ రెడ్డితో మాట్లాడుతామని కోరారు. దీంతో కిషన్‌ రెడ్డి కారు దిగి బాధితులతో మాట్లాడారు.

వరదల్లో తాము సర్వం కోల్పోయిన కేంద్రం నుంచి తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని కిషన్‌ రెడ్డిని ప్రశ్నించారు. తమను ఆదుకోవాలని కోరారు. వారితో మాట్లాడిన కిషన్‌రెడ్డి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా కిషన్‌ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలో వరద ముంపు బాధితులను పరామర్శించారు.

ANN TOP 10