కాంగ్రెస్ లోకి నిరంతరంగా కొనసాగుతున్న చేరికలు
కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో జాయినింగ్స్
యాపల్‌గూడ ,కొత్త గూడ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కంది శ్రీనివాస రెడ్డి
అమ్మ న్యూస్ ఆదిలాబాద్ : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజా సేవ భవన్ నిత్యం చేరికలతో సందడిగా మారుతోంది. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి చేరికల పరంపర కొన సాగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ బాట పడుతున్నారు. నిన్న రాత్రి ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ , కొత్తగూడ గ్రామస్తులు అల్చెట్టి నాగన్న, మామిళ్ల భూమన్న ఆధ్వర్యంలో తరలివచ్చి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే భుక్తాపూర్ నుండి పలువురు కాలనీవాసులు కూడా హస్తం పార్టీలో చేరారు.
తాజాగా మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని ఆధ్వర్యంలో తాటిగూడ,శాంతి నగర్ నుండి ఆదిలాబాద్ జిల్లా ఖురేషి సంఘం అధ్యక్షులు మసూద్ ఖురేషి ,ఉపాధ్యక్షులు అయ్యుబ్ ఖురేషి తో పాటు భారీ సంఖ్యలో ఖురేషి సంఘం సభ్యులు తరలి వచ్చారు. వారంతా కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి కండువాలు కప్పి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ అన్నారు.
ఒక బీసీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిందని తెలిపారు. కష్టపడి పని చేసే వారికి పదవులు వస్తాయడానికి ఉదాహరణ మహేష్ కుమార్ గౌడ్ నియామకమన్నారు. ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అవడం బీసీలకు గర్వకారణమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. బిజెపి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ 1200 చేస్తే కాంగ్రెస్ పార్టీ 500లకే ఇస్తుందని తెలిపారు. ఇక రెండు లక్షల రుణమాఫీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంత వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని గుర్తు చేసారు. పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల సాయం ,మహిళలకు ఉచిత బస్ ప్రయాణం , ఉచిత కరెంట్ ఇవన్నీ పేదల కోసమే అన్నారు. తాను ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాలలోకి వచ్చానని సమస్యలు ఏవున్నా అధిష్టానానికి తెలియ చేసి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.తాను ఉన్నంతవరకు నిత్యా న్నదానం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మన బలం బలగం పెంచుకోవాలని సూచించారు.రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి గా చేసే లక్ష్యం తో మనమందరం పని చేయాలన్నారు.వచ్చే ఎన్నికలేవైనా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో లోక ప్రవీణ్ రెడ్డి,కౌన్సిలర్లు ఆవుల వెంకన్న,సంద నర్సింగ్, జాఫర్ అహ్మద్,ఇమ్రాన్,నాయకులు ఎం.ఏ ఖయ్యుమ్,కొండూరి రవి,రాజా లింగన్న,మొహమ్మద్ రఫీక్,షేక్ మన్సూర్,అశోక్, అతిక్ ఉర్ రహమాన్, దాసరి ఆశన్న,సంతోష్,తోఫిక్,గంటు బాయి తదితరులు పాల్గొన్నారు.