గణేషుడికి కంది శ్రీనివాస రెడ్డి దంపతుల తొలిపూజ
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధన
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజా సేవాభవన్ ప్రాంగణంలో నెల కొల్పిన వినాయక మండపంలో గణనాథుడికి కంది శ్రీనివాసరెడ్డి దంపతులు కూతురు కంది అరిక రెడ్డితో హాజరై తొలి పూజలు నిర్వహించారు. నియోజక వర్గంలోని ప్రజలందరు సుఖ శాంతులతో పాడిపంటలతో సంతోషంగా ఉండాలని తలపెట్టిన పనులన్నీ ఎలాంటి విఘ్నం లేకుండా విజయవంతంగా పూర్తి అయ్యేలా దీవించాలని విఘ్నేశ్వరున్ని ప్రార్ధించారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు , అభిమానులు ,బంధు మిత్రులు హాజరై వినాయకునికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.