AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

70 ఏళ్లు 70 అడుగులు.. ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనం

తెలుగురాష్ట్రాల్లో వినాయ‌క‌చ‌వితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా న‌వ‌రాత్రి ఉత్సవాలను అంగ‌రంగా వైభ‌వంగా చేస్తున్నారు. ఊరూవాడ వినాయక విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తున్నారు. ఎడతెరపి లేని వానలు, వరదతో కాస్త ఇబ్బంది పడినా.. వరుణుడి కాస్త శాంతించటంతో చాలాచోట్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. మరోసారి ఖైర‌తాబాద్ వినాయ‌కుడు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.

ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖైర‌తాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి.. పూజలు నిర్వహిస్తున్నారు. 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 7 సర్పాలు.. రెండు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో విఘ్నేశ్వరుడిని సిద్ధం చేశారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10