సర్వ విఘ్నాలు తొలిగించే దేవుడు వినాయకుడు. ఆ ఆదిదేవుడిని కొలిచే వేళైంది. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేందుకు భక్తజనం సిద్ధమైంది. శనివారం గణేశుడు కొలువుదీరనుండగా, ఊరూరా మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
భక్తుల నిత్య పూజలతో నవరాత్రోత్సవాలు ఆధ్యాత్మికతను చాటనున్నాయి. పండుగ నేపథ్యంలో శుక్రవారం మార్కెట్లన్నీ బిజీగా మారాయి. ఎక్కడ చూసినా గణపతులు, పూజా సామగ్రి కొనుగోళ్లతో సందడిగా కనిపించాయి.