AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హీరో నితిన్ కు పుత్రోదయం

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్   తండ్రయ్యారు. ఆయన సతీమణి షాలిని కందుకూరి  పండంటి మ‌గ‌బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విష‌యాన్ని నితిన్ ఎక్స్ వేదిక‌గా తెలుపుతూ.. మా ఫ్యామిలీలోకి వ‌చ్చిన‌ సరికొత్త స్టార్‌కి స్వాగతం అంటూ ఫొటో పంచుకున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు నితిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020లో షాలిని కందుకూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నితిన్. అయితే షాలిని గర్భవతి కావ‌డంతో గ‌త రెండు నెల‌లు నితిన్ షూటింగ్‌ల‌కు విరామం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ రెండు భార్య‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు నితిన్.

సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో ‘రాబిన్ హుడ్’ అనే మూవీ చేస్తున్నాడు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10