AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సన్నిహితుడిని కోల్పోయా.. జిట్టా మృతిపై రేవంత్‌ తీవ్ర దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర
భావోద్వేగంతో సీఎం ట్వీట్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి మరణం తీవ్రంగా కలిచివేసిందని, అత్యంత సన్నిహితుడిని కోల్పోయానని సీఎం రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు. జిట్టా హఠాన్మరణంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి కొన్ని రోజుల నుంచి ఆయన బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

ఈ క్రమంలోనే జిట్టా మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా ఎమోషనల్‌ అయ్యరు. ‘మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అంటూ సీఎం ట్వీట్‌ చేశారు.

ANN TOP 10