రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి.ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు.
ఈ క్రమంలో ఖమ్మం వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా హెటిరో డ్రగ్స్ అధినేత, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. కోటి రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. లక్షలాది విలువచేసే మందులు వితరణ చేశారు. అలాగే వారం రోజులు పాటు ఖమ్మంలోనే సింధు హాస్పిటల్ డాక్టర్లు సేవలు అందిస్తారని ఆయన తెలిపారు.