AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారు : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో  సహా పోలీస్ అధికారులందరి ఫోన్లు ట్యాపింగ్  చేస్తున్నదని హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి  ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

జిల్లా మంత్రి ఇంట్లో మానకొండూర్ ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహిస్తే కరీంనగర్ సీపీ, మానకొండూరు సీఐతో టెలికాన్ఫరెన్స్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌ చేస్తున్నారనేదానికి ఇదే నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ట్యాపింగ్లు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని విమర్శించారు.

కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఫోన్ల ట్యాపింగ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ కేవలం 40 శాతం మాత్రమే చేశారని, ప్రతి రైతుకు రుణమాఫీ చేయా ల్సిందేనని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గం నిధులు మంజూరు చేయడం లేదని, అవసరమైతే కోర్టుకు వెళ్లైనా సరే నిధులు తెచ్చి ప్రజా సమస్యల పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

ANN TOP 10