AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సొంత పార్టీ నాయకురాలితో.. టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియో వైరల్

తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సొంత పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలితో ఏకాంతంగా గడిపిన ఓ వీడియో బయటకి వచ్చింది. అయితే బాధిత మహిళ ఎమ్మెల్యే తనను బెదిరించి బలవంతంగా అనుభవించినట్లు ఆరోపిస్తూ ఓ ప్రకటన చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను బాధిత విడుదల చేసినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై లైంగిక దాడి చేసినట్లు ఆమె ఆరోపిస్తోంది. గత కొంత కాలంగా ఏపీలో రాజకీయనాయకులకు సంబంధించిన ఏకాంత వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో తనకి చంద్రబాబు బీ ఫామ్ ఇవ్వడాన్ని తాను వ్యతిరేకించినందుకే తనపై కక్ష కట్టి బలవంతంగా వేధించినట్లు ఆమె వెల్లడించారు.

ఆమె ఆరోపణలపై మంత్రి కోనేటి ఆదిమూలం స్పందించారు. ఇదంతా టీడీపీ నాయకుల కుట్రలో ఓ భాగమేనని అన్నారు. ఆమెకు తనకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. అది మార్ఫింగ్ వీడియో అని అన్నారు. నేనేంటో తన నియోజకవర్గ ప్రజలకు తెలుసుని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ వీడియోలను ఆ బాధిత మహిళ విడుదల చేసినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పైన ఒత్తిడి తీసుకొచ్చి తనని లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల సెక్స్ ల భాగోతాలు సంచలనంగా మారాయి.  దీనిపై ఎమ్మెల్యే, టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ANN TOP 10