కేవలం రూ.99కే హైదరాబాద్–బెంగళూరు మధ్య ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఫ్లిక్స్ బస్ తెలిపింది. అందుబాటు ఛార్జీలతో, స్థిరమైన ప్రయాణానికి అంతర్జాతీయ బ్రాండ్‌గా ఉన్న ఫ్లిక్స్ బస్ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నై మార్గాల్లో బస్సులను కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలు, మౌలిక మంత్రి ఎంబీ పాటిల్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ పాల్గొన్నారు. బెంగళూరు నుంచి 33 నగరాలకు బస్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా రూ.99తో టికెట్ బుక్ చేసుకునే ఆఫర్ సంస్థ ప్రకటించింది. ఈ నెల 3–15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ తేదీలు సెప్టెంబరు 11–అక్టోబరు 6 మధ్య ఉండాలని సంస్థ తెలిపింది.