(అమ్మన్యూస్, ఆదిలాబాద్):
రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు, జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించేందుకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును ఆదిలాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి పెన్‌గంగా భవన్‌లో ఆయనకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలబోకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక సమస్యలు, వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలపై కొంతసేపు ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.