AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇద్దరు పిల్లలను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్న దంపతులు..

ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్‌ (40), వర్షిణి (33) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రిషికాంత్(11), విహంత్ (3). వీరి స్వస్థలం మంచిర్యాల గత కొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న వెంకటేశ్‌ మానసికంగా ఎంతో చిత్రవధ అనుభవించాడు. చివరికి భార్య వర్షిణితో కలిసి కుటుంబం అంతా చనిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో తమ అపార్ట్‌మెంట్‌లోనే ఇద్దరు పిల్లలను చంపి, దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

ANN TOP 10