AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కూలిన గాంధీభవన్‌ ప్రహరీ.. పలు వాహనాలు ధ్వంసం

తప్పిన పెను ప్రమాదం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
రాష్ట్రంలో వర్షాలు పెను బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోగా, మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఇళ్లు కూలిపోతున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలకు హైదరాబాద్‌ నాంపల్లిలోని గాంధీభవన్‌ ప్రహరీ కూలింది. పార్కింగ్‌ చేసిన కార్లపై గోడ కూలడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమయానికి అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇదిలా ఉంటే.. కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలువురు మంత్రులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయితీరాజ్, ఇరిగేషన్, హైడ్రా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిల్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశారు జారీ చేశారు. ఇక ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకి రావద్దని సూచించారు.

ANN TOP 10