AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘తెలంగాణ రాజముద్ర మారిపోయిందా..? ఎవరు, ఎప్పుడు ఆమోదించారు..?’

“తెలంగాణ చిహ్నం మారిపోయిందా.. ఎప్పుడు, ఎవరు ఆమోదించారు..? అసలు కొత్త చిహ్నం ఇంత సైలెంట్‌గా వచ్చిందా..?” గ్రేటర్‌ వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ప్రధాన కార్యా‌లయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూసిన వాళ్లందరికీ కలిగే అనుమానాలు ఇవి. అచ్చంగా ఈ అనుమానాలే అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా వచ్చాయి. గ్రేటర్ వరంగర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తెలంగాణ అధికారిక చిహ్నం స్థానంలో.. మరో కొత్త చిహ్నాన్ని ముద్రించారు. అప్పట్లో ఇదే కొత్త చిహ్నం అంటూ వైరల్ అయిన చిహ్నమే అది. ఆ చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణానికి బదులుగా అమరవీరుల స్థూపం ఉంది. ఈ ఫ్లెక్సీ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

 

దీనిపై స్పందించిన కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అసలు ఏం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా శాంతి కుమారి గారు? తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్‌తో ఈ వెకిలి పనులు ఏంటి? కాక‌తీయ కళా‌తో‌రణం, చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో గ్రేటర్‌ వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ప్రధాన కార్యా‌లయం ఎదుట అధి‌కా‌రులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ANN TOP 10