AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ప్రజలకు బిగ్ గుడ్‌న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీ.. సెప్టెంబర్ 17 నుంచి..!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త వినిపించారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిచబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. సెప్టెంబర్‌లో 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో.. అధికారులను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

 

పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. కాగా.. రేషన్ కార్డులు ఆర్యోగ్య శ్రీ కార్డులను వేరు వేరుగా అందిచాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులకు అర్హులను గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సైతం తెలంగాణలోని అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.

 

గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి వార్షిక ఆదాయం లక్షన్నరతో పాటు మూడున్నర ఎకరాల మాగాణి, ఏడున్నర ఎకరాల చెలక.. ఉండాలని సబ్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. ఇక.. పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారి వార్షిక ఆదాయం 2 లక్షలు ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. పాత కార్డుల స్థానంలో కొత్తకార్డులు ఇవ్వాలని, అవి కూడా స్వైపింగ్ మోడల్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

ANN TOP 10