జన్వాడ ఫామ్ హౌస్ సంగతేంటి? అసలే దూకుడు మీదున్న హైడ్రా.. జన్వాడ ఫామ్ హౌస్ పైకి బుల్డోజర్లను పంపిస్తుందా? జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ నేత కేటీఆర్ దేనని కాంగ్రెస్ నేతలు వాదిస్తూ వస్తున్నారు. అయితే, ఫామ్ హౌస్ తన పేరు మీద లేదని, అది తన మిత్రుడిదని, తాను లీజుకు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ తేల్చి చెబుతున్నారు.
ఈ వాదోపవాదాల మధ్య జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇవాళ ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ లో సర్వే చేపట్టారు. ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు అధికారులు. ఫామ్ హౌస్ దగ్గరి నుంచి ఫిరంగి నాలా వెళ్తుందని అధికారులు తెలిపారు. నాలా దగ్గరి నుంచి కొలతలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు సర్వేయర్ అక్కడ పరిశీలించారు. పూర్తి స్థాయిలో చెక్ చేస్తామని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫామ్ హౌస్ ను పరిశీలించామని, కొలతలు తీశామని, రిపోర్టును వారికి అందజేస్తామన్నారు.