ఇక విలీన ప్రక్రియ మొదలైనట్లే..
(అమ్మన్యూస్, హైదరాబాద్):
బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు వల్లే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందని, ఇది ముందు ఊహించిన విషయమేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవిత, ఈడీ, సీబీఐ విచారణలో భాగంగా ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయగా.. సుమారు రెండు గంటలపాటు ఇరువైపుల వాదనలు సుప్రీంకోర్టు విన్నది.
దీంతో విచారణ పూర్తి కావడంతో ఓ మహిళగా బెయిల్ కు కవిత అర్హురాలని తేల్చిన కోర్టు ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది. కాగా కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కవితకు బెయిల్ రావడం ఊహించిన విషయమేనని.. బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని ఆరోపించారు. అలాగే కేటీఆర్, హరీశ్‌రావు బీజేపీ నేతల చుట్టూ తిరిగి.. కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ఆరోపించారు. దీంతో బీజేపీలో బీఆర్‌ఎస్ విలీన ప్రక్రియ మొదలైంది అని.. ఎమ్మెల్సీ మహేష్‌మార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.