బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో 35 రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్యులు ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. జిట్టా నెమ్మదిగా కోలుకుంటున్నారని, ఎవరూ అధైర్య పడొద్దని జిట్టా యువసేన తెలిపింది.
జిట్టా త్వరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకుందామని పేర్కొంది. జిట్టా ఆరోగ్య పరిస్థితిపై భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు ఆరా తీశారు.