(అమ్మన్యూస్, తిరుమల):
భారీగా ఆభరణాలు ధరించి తిరుమల వచ్చే భక్తులను చూస్తుంటాం. శుక్రవారం కూడా 25 కేజీల బంగారు ఆభరణాలతో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ముగ్గురు భక్తులు. సాధరణంగా మగ వారు అధిక సంఖ్యలో ఆభరణాలు ధరించడం అరుదుగా చూస్తుంటాం. కేవలం మహిళలు మాత్రమే వివిధ రకాల ఆభరణాలు ధరించేందుకు మక్కువ చూపుతారు. కాలం మారుతున్న కొద్ది మగవారిలోనూ కొందరు బంగారు ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. గ్రాముల్లో కాదండి ఏకంగా కొన్ని కేజీల బంగారు ఆభరణాలు పురుషులు ధరిస్తున్న పరిస్థితిగా చూడచ్చు.
తిరుమలకు శ్రీ వెంకటేశ్వరుని క్షణకాలం దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులను క్యూలైన్ లో తనవైపు తిప్పుకునేలా చేశారు ఓ భక్త బృందం. ముగ్గురు వ్యక్తులు ఒంటిపై ఏకంగా భారీ స్థాయిలో ఆభరణాలు ధరించడం చూసి శ్రీవారి భక్తులు ఆకర్షితులు అయ్యారు. పుణెకు చెందిన భక్తులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి వీఐపీ విరామ సమయంలో పూణేకు చెందిన గోల్డ్ మెన్, గోల్డ్ ఉమెన్ పాల్గొన్నారు.