AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. బస్సులో 40మంది భారతీయులు

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. నేపాల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లోని తనహున్‌ జిల్లాలో మార్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయిందని.. బస్సులో ఉన్న ప్రయాణికులు భారతీయులు అని చెప్పారు. పోఖారా నుంచి ఖాట్మండు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.

ఉత్తర ప్రదేశ్‌ చెందిన ‘UP FT 7623’ నంబర్ ప్లేట్ గల బస్సు నదిలో ఒడ్డున పడి ఉందని జిల్లా పోలీసు కార్యాలయం తనహున్‌∙నుంచి డీఎస్పీ దీప్‌కుమార్‌ రాయ తెలిపారు. కాగా సమాచారం ఆదుకున్న యూపీ గవర్నమెంట్‌.. ఈ ఘటనపై అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. సహాయక చర్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అడిగి తెలుసుకున్నట్లు యూపీ రిలీఫ్‌ కమిషనర్‌ తెలిపారు.

ANN TOP 10