AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేషన్ షాపుల్లో సన్న బియ్యం, సబ్సిడీకి గోధుమలు

తెల్ల రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు. జనవరి నుంచి చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే.. సబ్సిడీకి గోధుమలను అందిస్తామని వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1629 రేషన్ డీలర్ల భర్తీ చేపడుతున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి, విధానాలనున తయారు చేయాలని, వీలైనంత త్వరగా భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.

పేదలు ఆహారం కోసం ఎన్నో కష్టాలు పడుతారని, వారికి సన్న బియ్యం అందించాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అదే సందర్భంలో డీలర్లకు వార్నింగ్ ఇచ్చారు. పీడీఎస్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడితే డీలర్షిప్ రద్దు చేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి మచ్చ తెస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. రేషన్ డీలర్ల ఆదాయం పెంపునకు ప్రణాళికలు వేస్తున్నామని, వారి న్యాయమైన కోర్కెలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని వివరించారు.

ప్రభుత్వ వసతి గృహలతోపాటు అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు విసురుతున్న తరుణంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10