AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవితకు మళ్లీ అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలింపు

చికిత్స అనంతరం జైలుకు తీసుకువచ్చిన అధికారులు
రేపు ఢిల్లీకి కేటీఆర్, హరీశ్‌రావు

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సుమారు 5 నెలలుగా ఆమె తిహార్‌ జైలులో ఉన్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇవాళ ఉన్న పళంగా కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో జైలు డాక్టర్ల సిఫార్స్‌ మేరకు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు అధికారులు తరలించారు. వైరల్‌ ఫీవర్‌ తో పాటు గైనిక్‌ సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్‌ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా గత జులైలోనూ కవిత జ్వరం, గొంతునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆమెను జైలు నుంచి ఎయిర్స్‌ కు దీనదయార్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు. తాజాగా మరోసారి కవిత అస్వస్థతకు గురికావడంతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.

ANN TOP 10