AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వివాహ వేడుక‌ల్లో కంది శ్రీ‌న‌న్న.. నూత‌న వ‌ధూవ‌రుల‌కు దీవెన‌లు

అమ్మ న్యూస్ ఆదిలాబాద్ః
ముహూర్తాలు ప్రారంభం కావ‌డంతో శుభ‌కార్యాలు ఊపందుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివాహ వేడుక‌ల‌తోపాటు ప‌లు శుభ కార్యాలను నిర్వహిస్తున్నారు. దీంతో ఎక్కడా చూసిన సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. అందులో భాగంగానే అభిమానంతో ఆహ్వానించిన‌వారి వివాహాదీ వేడుక‌ల‌కు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి హాజ‌ర‌య్యారు. నూతన వ‌ధూవ‌రుల‌ను క‌లిసి వారికి వివాహ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. కంది శ్రీ‌న‌న్న పెళ్లి కానుక‌ల‌ను బ‌హూకరించి నిండు మ‌న‌స్సుతో ఆశీర్వాదాలు అంద‌జేశారు. నిండూ నూరేళ్లు చ‌ల్లగా ఉండాల‌ని, సంతోషంగా త‌మ జీవ‌నం సాగించాల‌ని ఆకాంక్షిస్తూ దీవెన‌లు అందించారు. వారి కుటుంబ స‌భ్యులు, బంధువుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు.

మొద‌ట పట్టణంలోని ఆర్ఎస్‌ గార్డెన్‌లో గల అంకిత, శశాంక్ వివాహ వేడుకల‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించి కంది శ్రీనన్న పెళ్లి కానుకను బహూకరించారు. పద్మనాయక గార్డెన్‌లో షిండే సాయినంద, సాయికిరణ్ వివాహ వేడుకలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంత‌రం మినీ తనీషా గార్డెన్ లో జ‌రిగిన గాద‌రి సుజాత‌, జగదీష్ దంపతుల కుమార్తె శ్రీవల్లి నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి అటెండ‌య్యారు. చిన్నారిని ఆశీర్వదించి కంది శ్రీనన్న కానుకను అందించారు. ఆయ‌న వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్ సంద నర్సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, ఎంఏ షకీల్, డేరా కృష్ణారెడ్డి, బండి దేవిదాస్ చారి, సుధాకర్ గౌడ్, మ‌హమ్మద్ రఫీక్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10