గుండాల మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఇమ్మానుయేల్ జాతీయ జెండా ఎగురవేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ భాస్కరరావు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి.
