AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ.. రాజ్యసభ స్థానానికి మోగిన ఎన్నికల నగారా

21వరకు నామినేషన్ల స్వీకరణ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బుధవారం నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరణ ఉండనుంది. సెప్టెంబర్‌ 3న పోలింగ్‌.. అదేరోజు ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. కె. కేశవరావు రాజీనామాతో ఈ ఉపఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరణ ఉండనుంది. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఈసీ ప్రకటించనుంది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇటీవల షెడ్యూల్‌..
తెలంగాణలో కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆగస్టు 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీ. సెప్టెంబర్‌ 3నఈ ఎన్నిక జరగనుంది. అదేరోజు ఎన్నికల ఫలితాలను ఈసీ విడుదల చేయనుంది. తెలంగాణతో పాటు మిగతా 11 స్థానాలకు షెడ్యూల్‌ ను విడుదల చేసింది.

కాంగ్రెస్‌ కు మరో సీటు..
రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీకి బలం పెరగనుంది. మరో సీటు కాంగ్రెస్‌ ఖాతాలో పడనుంది. ఇటీవల తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కే. కేశవరావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎన్నికైన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం బీఆర్‌ఎస్‌ కు చేజారిపోయింది. రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ కు ఒక సీటు తగ్గనుంది. అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ స్థానం కాంగ్రెస్‌ కు దక్కనుంది.

ANN TOP 10