AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబుతో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని స్పీకర్ కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డ ప్రసాద్‌కు చంద్రబాబు పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గడ్డం ప్రసాద్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఈరోజు తాను కలిశానని వెల్లడించారు. హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశానని, ఈ సందర్భంగా చంద్రబాబు పుష్పగుచ్చం అందించారని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని మెమోరండం అందించామని పేర్కొన్నారు.

ANN TOP 10