AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్‌.. ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ పునరుద్ధరణ?

కేంద్రం వద్దకు కీలక ప్రతిపాదన

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారులకు త్వరలోనే శుభవార్త అందనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవలే రియల్‌ ఎస్టేట్‌ వర్గాలకు ఇండెక్సేషన్‌ ట్యాక్స్‌ ప్రయోజనాన్ని తిరిగి పునరుద్ధరించిన క్రమంలో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కి సైతం తిరిగి ఈ పన్ను ప్రయోజాన్ని కల్పిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత రోజుల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. మంచి రాబడులు వస్తుండడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కి ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ పునరుద్ధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు డెట్‌ ఫండ్స్‌కి ఇండెక్సేషన్‌ పునరుద్ధరించడంతో గ్రాండ్‌ ఫాదరింగ్‌ ప్రొవిషన్‌ జులై, 2024 వరకు పొడిగించాలని కేంద్రాన్ని కోరింది అసోషియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా . ఇటీవలే జులై 23, 2024కు ముందు కొనుగోలు చేసిన ప్రాపర్టీల ట్రాన్సాక్షన్లకు ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ పునరుద్ధరించిన క్రమంలో డెట్‌ ఫండ్స్‌కి సైతం కల్పించాలని ఏఎంఎఫ్‌ఐ విజ్ఞప్తి చేసింది.

గత నెల జులై 23, 2024 రోజున 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌పై ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ తొలగించింది. అయితే సీజీటీజీ రేటును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ తొలగించడం పట్ల మ్యూచువల్‌ ఫండ్‌ ఇండస్ట్రీ బాడీతో సహా వివిధ ఆర్థిక రంగాలకు చెందిన అసోసియేషన్స్‌ ఆందోళన వ్యక్తం చేశాయి. ద్రవ్యోల్బణం ఆధారిత టన్ను సర్దుపాటు సదుపాయాన్ని పునరుద్ధరించాలని కోరాయి. ఈ క్రమంలో ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లకు ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ పునరుద్ధరించింది కేంద్ర ఆర్థిక శాఖ. ఇండెక్సేషన్‌ ప్రయోజనంతో 20 శాతం ట్యాక్స్, ఇండెక్సేషన్‌ లేకుండా 12.5 శాతం ట్యాక్స్‌ ఆప్షన్లలో ఏదైనా ఎంచుకునే వీలు కల్పించింది. ఈ క్రమంలో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కి సైతం ఇలాంటి పొడగింపు కావాలని మ్యూచువల్‌ ఫండ్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తోంది.

ఈ మేరకు కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది ఏఎంఎఫ్‌ఐ. మూలధన లాభాల పన్నులో మార్పుల ద్వారా తలెత్తే సమస్యలు, వటి ప్రభావాలను హైలెట్‌ చేసింది. మార్చి 31, 2023 లేదా అంతకు ముందు డెట్‌ లేదా మనీ మార్కెట్‌ సాధనాల్లో 65 శాతం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే పథకాలలో పెట్టుబడి పెట్టడంపై ఆందోళనకరంగా మారినట్లు పేర్కొంది. అలాగే మార్చి 31, 2203 తర్వాత డెట్‌ పథకాల్లో 65 శాతం కన్నా తక్కువ పెట్టే పెట్టుబడులు, జులై 22, 2024 తర్వాత చేసిన ఈక్విటీ పెట్టుబడుల్లో 65 శాతానికిపైగా రిడంప్షన్‌ చేస్తేనూ ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ క్రమంలో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కి ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ పునరుద్ధరించాలని, జులై 23, 2024 వరకు ఈ ఫండ్స్‌ హోల్డింగ్‌ కాస్ట్‌పై ఇండెక్సేషన్‌ పొడిగించాలని కోరింది.

ANN TOP 10